విశాఖ బయలుదేరిన ఏపీ హోం మంత్రి, డీజీపీ    

వాస్తవం ప్రతినిధి: అరకు ఎమ్మెల్యే మావోల చేతిలో దారుణ హత్యకు గురవ్వడం తో ఏపీ హోంమంత్రి చినరాజప్ప, ఏపీ డీజీపీ ఠాకూర్‌ హుటాహుటిన విశాఖ బయలుదేరి వెళ్లారు. విశాఖ మన్యంలో ఎమ్మెల్యేలపై కాల్పులు జరిపి దారుణ హత్య చేసిన ఘటన సమాచారం అందిన వెంటనే వారు విశాఖ బయలుదేరి వెళ్లారు. అయితే మరోపక్క అమెరికా లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా కిడారి మృతి పై దిఘ్బ్రాంతి వ్యక్తం చేశారు. అసలు ఘటన వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.