జనసేన ఎఫెక్ట్”…ఆ స్థానాలపై బాబు “సర్వే” ల మీద “సర్వేలు”   

వాస్తవం ప్రతినిధి:  నిన్నటి వరకూ ఒక లెక్క..ఇప్పటి నుంచీ ఒక లెక్క ఇదీ పవన మార్క్ రాజకీయం..కాకలు తిరిగిన రాజకీయ యోధుడిగా  పేరొందిన చంద్రబాబు నాయుడు..దేశంలోనే సీనియర్ రాజకీయ దురందరుడిగా వెలుగొందే చంద్రబాబు నాయుడు ఇప్పుడు జనసేన దూకుడు రాజకీయాలు చూసి ఉలిక్కి పడుతున్నారట..భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని తెగ వరీ అవుతున్నారట చంద్రబాబు. అంతేకాదు సర్వే ల రారాజుగా పేరొందిన చంద్రబాబు ఇప్పుడు పశ్చిమలో ఒకటికి రెండు సార్లు సర్వేల మీద సర్వేలు చేయించుకుంటూ తన అభద్రతా భావాన్ని భయటపెట్టుకుంటున్నారట..ఇంతకీ అసలేమి జరిగిందనేకదా సరే అసలు విషయంలోకి వెళ్తే..

ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు జిల్లాలలోని నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి ఆ రిపోర్ట్ ల ఆధారంగా ఎన్నికల వ్యుహాలని రచిస్తూ పక్కా ప్లాన్ గా ముందుకు వెళ్తారు అంతేకాదు ఈ క్రమంలో నియోజకవర్గాలో నియమించిన ఇంచార్జ్ ల పనితీరు బాగోక పోయినా సరే నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తారట అయితే గడించిన కొంత కాలంగా పశ్చిమలో టీడీపీ గెలుపు ఓటములపై సర్వేలు చేపట్టిన బాబు కి దిమ్మతిరిగిపోయే రిపోర్ట్ లు అందాయట దాంతో ఒక్క సారిగా పస్చిమపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారట చంద్రబాబు.

పశ్చిమగోదావరి జిల్లా అంటే  రాజకీయంగా అన్ని పార్టీలకి సెంటిమెంట్ అయిన జిల్లా ఇక్కడ అధిక స్థానాలు ఎవరు గెలిస్తే సీఎం కుర్చీ వారికి సొంతం అవుతుందనేది తెలిసిన విషయమే అయితే బాబు నియమించిన దూతలు కొందరు పశ్చిమలో నిర్వహించిన సర్వేలలో టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే స్థానాలలో జనసేన జెండా పాతేలా ఉన్నారట వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరికీ దక్కుతుంది?.. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు?.. లాంటి ప్రశ్నలను సంధించగా దిమ్మతిరిగిపోయెలా సమాధానాలు వచ్చాయట..

ముఖ్యంగా పశ్చిమాలో పాలకొల్లు, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పోలవరం, ఏలూరు నియోజకవర్గాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో టీడీపీ హవా తగ్గిపోయిందట..కుల సమీకరణాల ద్వారా గానీ మరే ఇతర సమీకరణాల ద్వారా చూసుకుంటే అక్కడ కాపులు, బీసీలు, జనసేన పార్టీకి జై కొడతారని తెలుస్తోందట..అయితే బాబు ఈ సర్వేని 8 నెలల క్రితమే చేయించగా ఇప్పుడు తాజాగా జరిగిన సర్వేలో సైతం ఇదే విధమైన రిపోర్ట్ రావడంతో బాబు కి పశ్చిమలో మెజారిటీ గెలుపు స్థానాలపై బెంగ పట్టుకుందట..మరి ఈ క్రమంలో మళ్ళీ ఆ స్థానాలపై పట్టుకోసం బాబు ఎన్ని యుక్తులు పన్నుతాడో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు.