నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్.. జెడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రాజీనామా

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. జెడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రాజీనామా చేశారు. వెళ్తూవెళ్తూ ‘జగన్ ఒక నియంత’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి సీటు విషయమై నెలకొన్న విబేధాలే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వేంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నియమించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆ సీటు విషయమై జగన్ తనకు గట్టి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆనం 50 కోట్లు ఖర్చు పెడతారు.. మీరు పెట్టగలరా అని ఎదురు ప్రశ్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా పార్టీ సారధ్యం లేదా ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసినప్పటికీ నిరాకరించారు బొమ్మిరెడ్డి. జగన్ లాంటి డిక్టేటర్ దగ్గర వుండదల్చుకోలేదని, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.