దక్షిణ మెక్సికోలో దారుణ హత్యకు గురైన జర్నలిస్ట్

వాస్తవం ప్రతినిధి: దక్షిణ మెక్సికోలో ఒక జర్నలిస్ట్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. యాజలాన్‌లో ఎల్‌ హెరాల్డో డి చియాపస్‌ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న మారియో గోమెజ్‌ను శుక్రవారం దుండగులు హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హత్యకు గురైన జర్నలిస్టులలో ఈయన తొమ్మిదవ వారు. గోమెజ్‌ శుక్రవారం ఉదయం తన నివాసం నుండి బయటకు వస్తున్న సమయంలో దుండగులు మోటారు బైకు పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన కొద్ది సేపట్లోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. గోమెజ్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన పనిచేస్తున్న పత్రికా అధికారులు డిమాండ్‌ చేశారు. చియాపాస్‌లోని జర్నలిస్ట్‌ గిల్డ్‌ ఆయనకు సంతాపం తెలిపింది.