ఎందుకు చంపారో అర్ధం కావడం లేదు: కిడారి నాని

వాస్తవం ప్రతినిధి: ఆరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్ట్ ల చేతిలో దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కిడారి కుమారుడు కిడారి నాని స్పందిస్తూ…మావోయిస్టుల నుంచి త‌మ‌కు ఎప్పుడూ హెచ్చ‌రిక‌లు రాలేద‌ని అయితే ఎందుకు మావోలు మా నాన్నను చంపారో అర్ధం కావడం లేదని కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ దాడి గురించి తెలుసుకుని ఢిల్లీ నుంచి అర‌కుకు నాని బ‌య‌లుదేరాడు. ఈ సందర్భంగా నాని మీడియా తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. కిడారికి భార్య‌, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.