మిలిటరీ పెరేడ్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు!

వాస్తవం ప్రతినిధి: ఇరాన్ లో మిలిటరీ పెరేడ్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఇరాన్ లోని ఆవాజ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిలో చిన్నారులు,మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పరేడ్ జరుగుతున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు పాల్పడిన ఆగంతులకులను కూడా భద్రతా దళాలు హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అయితే పరేడ్‌ను వీక్షిస్తున్న ప్రజలు గన్‌ఫైర్‌తో కంగారు తిన్నారు. కాల్పులు పరేడ్‌లో భాగం అనుకున్న వారు ఆ తర్వాత ఉగ్రదాడి అని తెలియడంతో షాకయ్యారు. ఈ ఉగ్ర‌దాడిలో 8 మంది సైనికులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌ర్ని ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చ‌గా.. మ‌రో ఇద్ద‌రు పరారైన‌ట్లు ఓ మీడియా సంస్థ వెల్ల‌డించింది. సున్ని గ్రూపుకు చెందిన త‌ఫ్‌కిరి ఉగ్ర‌వాదులు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.