టాంజానియాలో ఘోర ప్రమాదం ..131మంది మృతి

వాస్తవం ప్రతినిధి: టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫెర్రీ బోల్తా పడిన ఘటనలో131 మంది ప్రాణాలు కొల్పోయినట్లు తెలుస్తుంది . బుగొలొరా పట్టణంలో జరిగిన సంతకు వెళ్లిన బాధితులు తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ఘటన జరిగింది. వంద మంది ఎక్కాల్సిన పడవలో 200 మంది ప్రయాణికులు, సిమెంటు బస్తాలు, అరటి గెలలు, మొక్కజొన్న బస్తాలు ఎక్కించడంతో బరువుకు అదుపు తప్పిన పడవ మునిగిపోయింది. ఇప్పటి వరకు మొత్తం 131 మంది మృతదేహాలను వెలికి తీసినట్టు ఆ దేశ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెల్ తెలిపారు.మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.