కత్తితో దాడి చేసిన డేకేర్ మహిళ

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అగ్రరాజ్యం అమెరికా లో వరుస ఘోర ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటనల నుంచి బయటకి రాకుండానే న్యూయార్క్‌లోని డేకేర్‌ సెంటర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. ఒక నెల వయసు కన్నా తక్కువ ఉన్న ముగ్గురు నవజాత శిశువులను హత్య చేయడానికి ఒక మహిళ యత్నించడంస్థానికంగా కలకలం రేగింది. దీనితో సదరు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మహిళ(52) క్వీన్స్‌ ప్రాంతంలో మరో ఇద్దరు పెద్ద వయసున్న వారిని కూడా ఇదేవిధంగా కత్తితో పొడిచినట్లు తెలిపారు. శిశువులలో ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఒక మగపిల్లవాడు ఉన్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళ ఎందుకు ఇలాంటి ఘోరానికి పాల్పడింది అన్న దానిపై అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.