అశ్లీల వెబ్ సైట్ల ను నిషేదించిన నేపాల్ ప్రభుత్వం

వాస్తవం ప్రతినిధి: నేపాల్ లో అశ్లీల వెబ్ సైట్ల ను నిషేదించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నేపాల్‌లో అత్యాచారాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అశ్లీల వెబ్‌సైట్లు, కంటెంట్ వల్లే యువత ప్రేరేపితమై అత్యాచారాలకు పాల్పడుతున్నారని అభిప్రాయ పడిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలానే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అసభ్యకరమైన దృశ్యాలను ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు పాటించని వెబ్‌సైట్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.