టీమిండియా కు కష్టాలు తప్పవు అంటున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా కు కష్టాలు తప్పవు అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్,మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. మరో రెండు నెలల్లో తమ దేశ పర్యటనకు రాబోతున్న టీమిండియాకు కష్టాలు తప్పవంటూ పాంటింగ్ వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌లో ఘోర పరాభవం ఎదుర‍్కొన్న టీమిండియా కు ఆసీస్‌ పర్యటనలో కూడా అదే తరహా అనుభవాన్ని చూడబోతుందంటూ ఆయన జోస్యం చెప్పాడు. సీమ్‌ బౌలింగ్‌కు అత్యంత అనుకూలమైన ఆసీస్‌ పిచ్‌లపై టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కఠిన పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందన్నాడు.