” నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు కేసులు పెడతారేమో” : బాలకృష్ణ

వాస్తవంసినిమా : ఓ వైపు ప్రజాప్రతినిధిగా, మరో వైపు నటుడిగా రెండు పాత్రలను తనదైన శైలిలో పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన విలన్ పాత్రలో నటించేందుకు తాను సిద్ధమంటూ చెప్పుకొచ్చారు.. ఇటీవల దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ రెడ్ కార్పెట్‌లో మాట్లాడుతూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. విలన్ పాత్రల్లో నటించేందుకు సిద్ధమని, అయితే తాను నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు కేసులు పెడతారేమో అంటూ నవ్వులు పూయించాడు బాలకృష్ణ. కాగా సైమా వేడుకల్లో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా క్రిటక్స్ కేటగిరిలో బాలకృష్ణ అవార్డును తీసుకున్న విషయం తెలిసిందే.