కుమార్తె ప్రేమ వివాహానికి ఓకే చెప్పిన వెంకటేష్

వాస్తవం సినిమా: విక్టరీ వెంకటేష్ రియల్ లైఫ్ లో మామగారు కాబోతున్నారనే వార్త తాజాగా ఫీం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.వెంకీ కుమార్తె అశ్రిత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లాడబోతోందట. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేమ వివాహాన్ని వెంకీ ఒకే చేశారని తాజా టాక్.

అశ్రిత ప్రొఫెషనల్ బేకర్. బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకున్నారు. ఇన్ ఫినిటీ ప్లేటర్ పేరుతో హైదరాబాద్ నగరంలో పలు స్టాల్స్ ని నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లోనూ ఈ తరహా స్టాల్ ఒకటి నిర్వహణలో ఉంది. ఇక అశ్రిత ప్రేమించిన యువకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామి రెడ్డి కుమారుడు – సురేందర్ రెడ్డి మనవడు అని తెలుస్తోంది. వీరి ప్రమకు ఇరువైపుల పెద్దలు అంగీకరించడంతో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుందిట.
వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్-2 చిత్రీకరణ కోసం ప్రేగ్ వెళ్లారు. అక్కడ చిత్రీకరణ ముగించుకుని త్వరలో తిరిగి హైదరాబాద్ కి విచ్చేస్తున్నారు. వెంకీ రాగానే అశ్రిత నిశ్చితార్థ వేడుక ఉంటుందని తెలుస్తోంది.