కొణిదెల ప్రొడక్షన్స్‌ లో ఎన్టీఆర్

వాస్తవం సినిమా: కొణిదెల ప్రొడక్షన్స్‌ను ప్రారంభించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. మొదటి చిత్రంగా తన తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నంబర్.150’ను తెరకెక్కించారు. ఆ చిత్ర విజయోత్సాహంతో చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ని కూడా తన బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ బ్యానర్‌లో తన ఫ్యామిలీ హీరోలతో పాటు మిగిలిన హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలనుందని ఓ సందర్భంలో వెల్లడించిన రామ్ చరణ్ అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా తన స్నేహితుడు ఎన్టీఆర్‌తో చెర్రీ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలుసు. అంతేకాదు రాజమౌళి డైరక్షన్ లో ఇద్దరు కలిసి మల్టీస్టారర్ కూడా చేస్తున్నారు. మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమానే భారీ అంచనాలతో వస్తుంటే ఇక చరణ్ నిర్మాణంలో ఎన్.టి.ఆర్ సినిమా మరింత క్రేజ్ తెచ్చుకొంటుందనేది పక్కా.. కాదంటారా?