హిందూ మహాసముద్రంలో చిక్కుకున్న భారత నేవీ అధికారి

వాస్తవం ప్రతినిధి: హిందూ మహా సముద్రంలో భారత నేవీ అధికారి చిక్కుకున్నారు. ఈ నేపధ్యంలో ఆ అధికారి ని కాపాడేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌(2018)లో పాల్గొనేందుకు వెళ్లిన భారత నేవీ కమాండర్‌ అభిలాష్‌ టామీ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1900 నాటికల్‌ మైళ్ల దూరంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కమాండర్‌ టామీ ప్రయాణిస్తున్న సెయిలింగ్‌ బోట్ థురియా హిందూ మహాసముద్రంలో చిక్కుకుంది. దానికి తోడూ ఆయనకు తీవ్ర వెన్ను నొప్పి రావడం మరోపక్క వాతావరణ మార్పుల కారణంగా 130కి.మీ వేగంతో బలమైన గాలులు వీయడంతో పడవ నడపటం కష్టంగా మారింది. దీంతో ఆయన నడి సముద్రంలో నిలిచిపోయారు. టామీని కాపాడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా రెస్క్యూ కో-ఆర్డినేషన్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్స్‌లో జులై 1 నుంచి జరుగుతోన్న ఈ గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి పాల్గొనే ఏకైక వ్యక్తి టామీనే. ఈ రేస్‌లో భాగంగా దాదాపు 30వేల మైళ్ల దూరం పాటు పోటీదారులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మధ్యలోనే టామీ చిక్కుకోవడం అతడి ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది నెలకొనడం తో భారత నావికా దళ సభ్యులు రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు