ఏపీలో ఈవారంలో డీఎస్సీ నోటిఫికేషన్

వాస్తవం ప్రతినిధి: ఏపీలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే వారంరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్వూలు లేకుండా, పూర్తిగా ప్రతిభ ఆధారంగా నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. పాఠశాల విద్యాశాఖతో పాటు మున్సిపల్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 9,275 ఉపాధ్యాయ పోస్టులు ఈ నోటిఫికేషన్ లో ఉంటాయని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు.