తెరపైకి మళ్ళీ “ఓటుకు నోటు”..రంగంలోకి…“ఈడీ”

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో ఒక పక్క ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రాజకీయ వ్యుహాలకి పావులు మెల్ల మెల్లగా కదులుతున్నాయి..కేసీఆర్ ని దెబ్బకొట్టాలని చంద్రబాబు ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ కూటమిలో చేతులు కలపడమే కాకుండా కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించడానికి వ్యూహరచన చేస్తున్నారు అందులో భాగంగానే టీఆర్ఎస్ లో అసమ్మతి నేతలని మెల్ల మెల్లగా హస్తం గూటికి చేరేలా ప్రయత్నాలు సాగుతున్నాయి అయితే

కూటమి పెద్దలలో అతిపెద్ద తలకాయి అయిన చంద్రబాబు ఈ వ్యుహాలకి మూలం అని గ్రహించిన కేసీఆర్ బాబు చెక్ పెట్టడానికి మళ్ళీ తెరపైకి ఓటుకు నోటుని తీసుకు వస్తున్నాడని టాక్ వినిపిస్తోంది..గతంలో చంద్రబాబు గొంతుతో బ్రీఫ్ద్ మీ అని చెప్పిన మాటలు ఓటుకు నోటులో దొరికిన వైనం అందరికి గుర్తు ఉండనే ఉంది కదా ఈ విషయంలో తెలంగాణా సర్కార్ కొంతకాలం సైలెంట్ అయినా సరైన సమయంలో ఈ వ్యవహారాన్ని బయటకి తీయాలని వేచి చూసింది అందుకు తగ్గట్టుగానే టీజీ సర్కార్ అవినీతి నిరోధక శాఖ అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది

ఈ క్రమంలో ఒక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి కష్టాలు మొదలయ్యాయని మీడియా వర్గాలో జోరుగా వార్తలు వస్తున్నాయి…”ఓటుకు నోటు కేసు” లో ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ – ఈడీ, రంగం లోకి దిగబోతోంది అన్న వార్తే అందుకు సాక్ష్యం. సుమారు ఐదుకోట్ల రూపాయల అవినీతి పై విచారణ జరిపి కేసు నిగ్గు తేల్చాలని అంటూ ఈడీతో పాటుగా సహా కేంద్ర సంస్థలకు పోలీసు ఉన్నతాధికారుల నుండి లేఖ వెళ్లడం ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఈ వార్త మింగుడు పడటం లేదట.

అయితే ఈ డీల్ లో దొరికిన 50 లక్షల రూపాయలు ఎవరివి..? అసలు అవి ఎక్కడి నుంచీ వచ్చాయి..? మిగిలిన రూ 4.5 కోట్ల రూపాయలు మాట ఏమిటి..? అనే ప్రశ్నలతో ఈడీ విచారణ చేయడానికి సిద్దంగా ఉందట..తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఎన్-ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాయటం వల్ల ఈ కేసుపై త్వరలోనే భారీ పరిణామాలు ఉంటాయని పరోక్షంగా బాబు కి హెచ్చరిక చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో తిరుగులేదని భావిస్తున్న కేసీఆర్ పై చంద్రబాబు రాజకీయాలు చేయడం అస్సలు కేసీఆర్ కి మింగుడు పడటం లేదట దాంతో బాబు స్పీడుకు బ్రేకులు వేయడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అంటున్నారు విశ్లేషకులు..