నల్లగొండ జిల్లా లో కేసీఆర్ కు గుడి కట్టించిన వీరాభిమాని

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన ఓ కానిస్టేబుల్ ఆయనకు గుడి కట్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.వివరాలప్రకారం. నల్లగొండ జిల్లా నిడమనూరు గ్రామానికి చెందిన గోగుల శ్రీనివాస్‌ చౌటుప్పల్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి పేద ప్రజల్లో దేవుడిగా నిలిచాడని, ప్రత్యేక రాష్ట్రం కెసిఆర్‌తోనే సాధ్యమైందని ఆయనకు వీరాభిమానిగా మారాడు. గుడి కట్టించి నిత్యం పూజలు చేయాలనే ఉద్దేశ్యంతో నిడమనూరులో తనకున్న 10 గుంటల స్థలంలో సోంతడబ్బులతో గుడి నిర్మాణం మొదలు పెట్టాడు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అంటున్నాడు.