జగన్ పాదయాత్ర @ 267 వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకై ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 267 వ రోజుకు చేరుకొంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తైసిందే. ఈ ఉదయం భీమిలి నియోజకవర్గంలోని పప్పలవానిపాలెం క్రాస్‌ నుంచి తన పాదయాత్రను జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి కొలవానిపాలెం క్రాస్‌, భీమేంద్రపాలెం, ఎర్రవానిపాలెం క్రాస్‌, రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటున్న జగన్.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాగా మరోవైపు ఇప్పటికే 3వేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ అధిగమించిన విషయం తెలిసిందే.