ఉత్తర కొరియా పై విధించిన ఆంక్షలను కొన్ని దేశాలు అతిక్రమిస్తున్నాయి: నిక్కీ హేలీ

వాస్తవం ప్రతినిధి: ఉ.కొరియాపై విధించిన ఆంక్షలు కొన్ని దేశాలు అతిక్రమిస్తున్నాయని అగ్రరాజ్యం అమెరికా గగ్గోలు పెడుతుంది. ఈ నేపధ్యంలో ఆంక్షలు పాటించని దేశాలపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలిని తక్షణమే సమావేశపరచాలని అది డిమాండ్‌ చేసింది. ‘ఉ.కొరియాపై ఐరాస విధించిన ఆంక్షలను అమలు చేసి వాటిని ఇతర దేశాలు అనుసరించేలా వత్తిడి పెంచాలని అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ కోరారు. ఉ.కొరియాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తున్న దేశాల పేర్లను ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ, కొన్ని రష్యా ప్రభుత్వ సంస్థలు ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తున్న వైనంపై స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తుంది.