ఇండోనేషియా లో పడవ ప్రమాదం…..13 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియా లో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ దేశంలోని సులవేశి ద్వీప ప్రాంతానికి వస్తున్న ఆ పడవ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకొని అనంతరం మునిగింది. అయితే ప్రమాద సమయంలో  దాదాపు 150 మంది పడవ లో ప్రయాణిస్తున్నారు. పడవ ప్రమాదానికి గురికావడం తో శనివారం మధ్యాహ్నానికల్లా 126 మంది ప్రయాణికులను అతికష్టం మీద రక్షణ బృందం ఒడ్డుకు చేర్చగలిగింది. అయితే మిగతా వారి ఆచూకీ కానరాక పోవడం తో అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలానే మంటలు ఎందుకు చెలరేగాయో  అన్న విషయం మాత్రం తెలియరాలేదు.