అంగరంగ వైభవంగా సైమా అవార్డ్స్ వేడుక

వాస్తవం సినిమా: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకు తారాలోకం దిగివచ్చింది. దుబాయ్‌లో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరిగిన సైమా వేడుకకు సౌత్ ఇండియాకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. 2017- 2018 ఏడాదికి గానూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వివిధ కేటగిరీలల్లో భాగంగా అవార్డుల ప్రదానం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. తొలిరోజు తమిళ, మలయాళ సినిమాలకు సంబంధించిన అవార్డుల ప్రదానం జరగగా.. రెండోరోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులు ప్రధానోత్సవం జరిగింది. టాలీవుడ్‌కి సంబంధించి ‘బాహుబలి 2’ చిత్రం ఎప్పటిలాగే అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరో, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ విలన్ కేటగిరీలలో అవార్డులను గెల్చుకుని ‘సైమా’లోనూ సత్తా చాటింది.
అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్త‌మ చిత్రం – బాహుబ‌లి 2
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – రాజ‌మౌళి (బాహుబ‌లి 2)
ఉత్త‌మ హీరో – ప్ర‌భాస్ (బాహుబ‌లి 2)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు – ఎంఎం కీర‌వాణి (బాహుబ‌లి 2)
ఉత్త‌మ గాయ‌కుడు – కాల భైర‌వ (బాహుబ‌లి 2)
ఉత్త‌మ విల‌న్ – రానా (బాహుబ‌లి-2)
బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ – సెంథిల్ కుమార్ (బాహుబ‌లి 2)
బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ – సెంథిల్ కుమార్ (బాహుబ‌లి 2)
ఎంట‌ర్‌టైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ – రానా (బాహుబ‌లి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి)
ఉత్త‌మ చిత్రం (క్రిటిక్స్)-గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి
బెస్ట్ యాక్ట‌ర్ లీడింగ్ రోల్ క్రిటిక్స్ – బాల‌కృష్ణ (గౌత‌మి పుత్ర శాత‌కర్ణి)
ఉత్త‌మ హీరోయిన్‌- కాజ‌ల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు – ఆది (నిన్ను కోరి)
ఉత్త‌మ స‌హాయ న‌టి – భూమిక (ఎంసీఏ)
ఉత్త‌మ గాయ‌ని – మ‌ధుప్రియ (ఫిదా)
ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్ – సందీప్ వంగా (అర్జున్ రెడ్డి)
ఉత్తమ డెబ్యూ యాక్ట‌ర్ – ఇషాన్ (రోగ్‌)
ఉత్తమ లిరిక్ రైట‌ర్ – సుద్ధాల అశోక్ తేజ (ఫిదా)
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ – క‌ళ్యాణి ప్రియద‌ర్శ‌న్ (హ‌లో)
బెస్ట్ క‌మెడీయ‌న్ – రాహుల్ రామ‌కృష్ణ (అర్జున్ రెడ్డి)
బెస్ట్ యాక్ట్రెస్ లీడింగ్ రోల్ క్రిటిక్స్ – రితికా సింగ్ (గురు)