“సైరా” లో ఆ సీన్ కోసం ఎన్ని కోట్లు ఖర్చో తెలిస్తే…“షాకే”

 వాస్తవం సినిమా:  మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్ ఎంతో సెరవేగంగా సాగుతోంది..ఎక్కడా కొంచం కూడా గ్యాప్ తీసుకోకుండా  ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్ ..మెగాస్టార్ ఇప్పటి వరకూ చేయనటువంటి పాత్రలో ఎంతో వైవిధ్యభరితంగా కనపడనున్నారు..చిరంజీవి కూడా ఈ సినిమాలోని నరసింహారెడ్డి ప్రాత్ర పై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని అభిమానులని అలరించడానికి ఎంతో కష్టపడుతున్నారు…ఇదిలాఉంటే

సైరా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది..ఎంతో భారీ బడ్జెట్ సినిమా అయిన సైరా ని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు...ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ హల్చల్ చేస్తోంది…తెల్ల దొరల ని చీల్చి చెండాడిన ఒక యోధుడి జీవిత గాధతో కూడిన చారిత్రక చిత్రం కావటంతో ఈ కధ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతున్న న్యూస్ ఏమిటంటే..సైరా సినిమాలో ఒక్క సీన్ కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట..సినిమాలో కీలక సమయంలో వచ్చే సీన్‌ కావటంఅదే సమయంలో గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా భారీగా ఉండటంతో భారీ ఖర్చు పెట్టక తప్పడం లేదని అయితే ఔట్పుట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందని అంటున్నారు..అయితే ఈ యుద్ద సన్నివేశాల కోసం ఫేమస్ హాలీవుడ్ యాక్షన్  కొరియోగ్రాఫర్‌లు వర్క్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది.