“చంద్రబాబు” ని పట్టుకున్న…“చంద్రగిరి గ్రహణం”

వాస్తవం ప్రతినిధి: రాజకీయాలు ఎవరిని ఎప్పుడు సింహాసనంపై కూర్చోపెడుతాయో అధఃపాతాళానికి తోక్కేస్తాయో ఎవరూ చెప్పలేనిది , ఊహించలేనిది కూడా  అయితే రాజకీయల్లో ఉన్నంతకాలం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలనేది నీతి రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు చూసి ఒక స్థాయికి వెళ్ళిన ఉద్దండులకి సైతం కొన్ని స్థానాలు కొరకరాని కొయ్యగా మారిపోతాయి. ఆఖరికి సొంత నియోజకవర్గంలో సైతం చక్రం తిప్పలేని పరిస్థితి ఎదురవుతుంది..ఇలాంటి విపత్కర పరిస్థితులని ఇప్పుడు ఉన్న ఎంతో మంది రాజకీయ నేతలు ఎదుర్కొంటూనే ఉన్నారు..అయితే లిస్టు లో

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు ఎంతటి అనుభవం ఉన్నా సరే పరిస్థితులు అనుకూలించక పొతే పరిస్థితి తారుమారవుతుంది…దేశంలో చంద్రబాబు అంతటి గొప్ప తెలివైన ,అనుభవంగల రాజకీయ మరొకరు లేరని చెప్పుకునే చంద్రబాబు కి తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో నెగ్గలేని పరిస్థితి ఏర్పడింది.. చంద్రబాబును స్వంత నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా అభిమానించడం లేదని..అక్కడ తెలుగుదేశం గెలుపుని అక్కడి ప్రజలు కోరుకోవడం లేదని స్పష్టం అవుతోంది..అయితే ఇప్పటి వరకూ చంద్రగిరి గెలుపు ఓటమిలని ఒక్కసారి పరిశీలిస్తే..


1983లో తెలుగుదేశం గాలి వీయడంతో రైతు నేత వెంకట్రామ నాయుడు అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబు పై పదివేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు…1985లో టిడిపి అభ్యర్థి వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై విజయం సాధించినా చావో రేవో అనేట్టుగా తెలుగుదేశానికి విజయం వరించింది…ఇక 1989, 1999, 2004, 2009 లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గల్లా అరుణ విజయం విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో అంటే 2014లో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టిడిపి అభ్యర్థి గల్లా అరుణపై విజయం సాధించారు.

అయితే ఒక్క సారి ఈ గెలుపు ఓటమిలని పరిశీలిస్తే “చంద్రగిరి” నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్దులకి కాకుండా టీడీపీ యేతర వ్యక్తులకి మాత్రమే పట్టం కడుతూ వచ్చారు చంద్రబాబు ఎన్నో విధాలుగా వారిని ఆకట్టుకోవాలని చూసినా సరే ఫలితం లేకుండా పోయింది..అయితే చంద్రగిరిలో తనకి సత్తా లేదని చూసిన బాబు ముందుగానే అలెర్ట్ అయ్యి 1989లో చంద్రగిరిలో పోటీ చేయకుండా “కుప్పం” నియోజకవర్గం ఎంచుకుని పోటీ చేసి విజయం సాధించాడు…అయితే వచ్చే 2019 ఎన్నికల్లో అయినా చంద్రబాబు కి పట్టిన చంద్రగిరి గ్రహణం వీడుతుందో లేదో వేచి చూడాల్సిందే.