అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కుమారుడి పైశాచికం

వాస్తవం ప్రతినిధి: భాద్యత గల అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కుమారుడు నిర్వాకం కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. దీనితో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనాగరిక రీతిలో ఓ యువతిపై దాడిచేసి…..ఆ దారుణాన్ని కళ్లకు కట్టే వీడియోతో మరో యువతిని  బెదిరించిన రోహిత్‌ సింగ్‌ తోమర్‌(21) అనే యువకుడిని శుక్రవారం  పోలీసులు అరెస్టు చేశారు. అతడు సాక్షాత్తూ ఢిల్లీ లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టరుగా ఉన్న అశోక్‌ కుమార్‌ తోమర్‌ అనే పోలీసు ఉద్యోగి కుమారుడు కావడం గమనార్హం. ఆ యువతిని జుట్టుపట్టుకుని నేలమీద పడేసి ఈడుస్తూ…కాళ్లతో పొట్టలో గట్టిగా కొడుతూ ఆమెకు విపరీతమైన నొప్పి కలిగించేలా అతడు దాడికి తెగబడ్డాడు. ఇదంతా వీడియో తీస్తున్న మరో యువకుడు ‘రోహిత్‌…ఆగు…చాలు..ఆగు’ అంటూ వారిస్తున్న స్వరం కూడా వీడియోలో వినపడుతోంది. అదే వీడియో చూపి తనను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడంటూ రోహిత్‌ సన్నిహితురాలిగా పేర్కొంటున్న మరో యువతి వచ్చి ఫిర్యాదు చేయడం అతడి పైశాచికత్వానికి అద్దం పడుతోంది. దీంతో, అతడిపై గురువారం తిలక్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో….శుక్రవారం ఉత్తమ్‌నగర్‌ పీఎస్‌లో వరుసగా కేసులు నమోదైనాయి.

సన్నిహితురాలిని వీడియోచూపి బెదిరించడం ఓ కేసైతే…. రోహిత్‌ తనపై ఇటీవల అత్యాచారం చేశారంటూ అతడి చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడం రెండో కేసు. వీడియోలో ఉన్న యువతిపై భౌతిక దాడి ఘటన మాత్రం ఢిల్లీ ఉత్తమనగర్‌ ప్రాంతంలో ఈ నెల 2 వతేదీన జరిగినట్లుగా  తెలుస్తోంది.