అమెరికా,చైనా లను వణికించనున్న పెను తుఫానులు

వాస్తవం ప్రతినిధి: పెను తుఫానులు అమెరికా,చైనా లను వణికించనున్నాయి.  భారీ వర్షాలు, వరదలు, రాకాసి అలలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అమెరికాలోని కరోలినా ప్రాంతాన్ని ‘ఫ్లోరెన్స్‌’ తుపాను తాకనుండగా, మరోవైపు హాంకాంగ్‌, దక్షిణ చైనాల దిశగా మంగ్‌హట్‌ తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. మంగ్‌హట్‌ తుపానును ‘సూపర్‌ టైఫూన్‌’గా వర్గీకరించారు. దీని ధాటికి గంటకు 155మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి. వారాంతానికి దక్షిణ చైనాకు సమీపంగా తుపాను తాకుతుందని, ఫిలిప్పీన్స్‌లో కూడా ఈ తుపాను ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.