నిత్యామీనన్ ఓకే అనడమే తరువాయి

వాస్తవం సినిమా: ప్రస్తుతం నాని ‘దేవదాస్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత నాని ‘జెర్సీ’ సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలో కథానాయికగా కశ్మీర పరదేశిని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో నాని యువకుడిగానే కాకుండా మధ్య వయసున్నవాడిగాను .. వృద్ధుడిగాను కనిపించనున్నాడు. అందువలన మరో హీరోయిన్ అవసరం కూడా వుందట. దాంతో నిత్యామీనన్ ను తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా తెలుస్తోంది. సంప్రదింపులు మొదలయ్యాయని కూడా అంటున్నారు. గతంలో నాని .. నిత్యామీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘అలా మొదలైంది’ ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నిత్యామీనన్ ఓకే అంటే ఈ జంట మరోసారి ప్రేక్షకులకు కనులపంట చేయనుందన్న మాట.