వెంకీ వద్దకు చేరిన పవర్ స్టార్ సెలెక్టెడ్ స్క్రిప్ట్

వాస్తవం సినిమా: పవన్‌ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్‌ పలు కథలను రాయడం జరిగింది. కాని అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌ పూర్తి స్థాయిలో రాజకీయాలో నిమగ్నమైన సంగతి తెలిసిందే కాగా, ఇటువంటి సమయంలో గతంలో పవన్‌ ఒకే చేసిన ఒక కథతో వెంకీ హీరోగా త్రివిక్రమ్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్‌ త్వరలోనే వెంకీతో సినిమాను చేస్తాడని తెలుస్తోంది. ఈ కథపై చాలా నమ్మకంగా ఉన్న త్రివిక్రమ్‌
వెంకీ హిత్ చిత్రాల ఖాతాలో ఈ చిత్రం చేరుతుందని అంటున్నాడు. వెంకీ కూడా స్టోరీ లైన్‌కు ఫిదా అయ్యి వెంటనే డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం . ప్రస్తుతం వెంకీ రెండు మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ రెండు చిత్రాల తర్వాత అంటే వచ్చే వేసవిలో త్రివిక్రమ్‌తో మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. `