పెళ్లి కి ఇంకా సమయం ఉంది: తాప్సీ

వాస్తవం సినిమా : తాను పెళ్లి చేసుకుని స్థిర పడటానికి ఇంకా సమయం ఉందని నటి తాప్సీ అంటున్నారు. ఆమె కథానాయికగా నటించిన ‘మన్మర్జియా’ చిత్రం శుక్రవారం   ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన కెరీర్‌, పెళ్లి గురించి మాట్లాడారు. డెన్మార్క్‌కు చెందిన మథియాస్‌ బో అనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడితో తాప్సి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. తాను ప్రేమలో ఉన్న మాట నిజమే కానీ, పెళ్లికి మాత్రం ఇంకా సమయం ఉందని,పిల్లలు కావలి అనుకున్నప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని ఆమె అన్నారు.  పెళ్లికి ముందే పిల్లల్ని కనను. మనం ప్రేమించే వ్యక్తితో సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా..?’ అని వెల్లడించారు తాప్సి.

‘మన్మర్జియా’ చిత్రానికి అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించారు. అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌ కథానాయకులుగా నటించారు. సినిమాకు మంచి స్పందన కూడా వస్తోంది. ప్రస్తుతం తాప్సి చేతిలో ‘తడ్కా’, ‘బద్లా’ చిత్రాలు కూడా ఉన్నాయి.