ఆగిపోనున్న “సైరా” షూటింగ్..?..మళ్ళీ..

వాస్తవం సినిమా: తెలుగు సినిమా చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి” చిరు ఇప్పటి వరకూ ఇలాంటి చారిత్రాత్మకమైన చిత్రంలో నటించలేదు..అందులోను ఇది వాస్తవ జీవితానికి సంభందించినది ఒక యోధుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో చిరు ఈ సినిమాని ఎంతో సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కడా కూడా పోస్ట్ పోన్ అవ్వకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూడా అయితే.

.
ఇప్పుడు సైరాకు షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోనుంది అంటూ టాక్ వినిపిస్తోంది..చిరు ఈ సిన్మాకి కొంత గ్యాప్ ఇవ్వనున్నారట ఈ న్యూస్ ప్రస్తుతం అభిమానులని కలవరపెడుతోంది..వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని తమ అభిమాన నటుడు మెగాస్టార్ ని తెరపై చూసుకోవచ్చు అనుకున్న అభిమానులకి నిరాశే మిగాలనుంది అంటున్నారు సినిమా విశ్లేషకులు..ఇంతకీ సైరా షూటింగ్ కి బ్రేకులు ఎందుకు పడుతున్నాయి ఏమి జరుగుతోంది అంటే..


ప్రస్తుతం సైరా షూటింగ్ జార్జియా లో జరుగుతోంది దాదాపు ఇక్కడ ఒక్క అవుట్ డోర్ షూటింగ్ కు 50 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు సమాచారం..అయితే జార్జియా నుంచి తిరిగి వచ్చిన తరువాత చిరంజీవి ‘సైరా’ పనుల పై కాకుండా రాజకీయాల పై దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఎదురవుతోందట దాంతో అనుకోని పరిస్థితిలు ఎదురయ్యాయిని టాలీవుడ్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి..విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ నెలాఖరకు జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీలో చిరంజీవికి కీలక స్థానం ఇవ్వాలనీ రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందట..దాంతో

తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఓటర్లని మరియు తన అభిమానులని ఓట్లుగా మలచాలని రాహుల్ చిరుకి కీలక ఆదేశాలు జారీ చేశారట..ఎటువంటి పనులు అయినా సరే తప్పకుండా పక్కన పెట్టాల్సిందే షూటింగ్ సైతం పక్కన పెట్టండి అంటూ చిరుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది..వాస్తవానికి కర్ణాటక ఎన్నికల్లోనే చిరుని ప్రచారానికి దింపాలని అనుకున్నా సైరా బిజీ షెడ్యులు లో కుదరలేదట దాంతో కీలకమైన తెలంగాణా ఎన్నికల్లో చిరు ఉండాల్సిందే అంటూ రాహుల్ ఉత్తమ్ కి ఆదేశించారని తెలుస్తోంది..మరి చిరు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలిసిందే. `