గణేష్ నిమజ్జనంలో అపశృతి

వాస్తవం ప్రతినిధి: గణేష్ నిమజ్జనం లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం నిర్వహించిన ఈ గణేష్ నిమజ్జనంలో ఇద్దరు యువకులు కృష్ణా నదిలో గల్లంతయ్యారు.  దీనితో వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని గల్లంతయిన యువకులు అమరావతి గోపాల్‌నగర్‌కు చెందిన మర్రి వెంకటేశ్‌, ఏసుబాబు (18)లుగా గుర్తించారు. అయితే నదిలో గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న యువకుల కుటుంబీకులు, బంధువులు రోదిస్తున్నారు.