కాంగ్రెస్ పార్టీ ని వీడిన మేఘాలయ మాజీ సి ఎం

 వాస్తవం ప్రతినిధి: మేఘాలయ మాజీ సి ఎం డాన్వా దెత్ వెల్సన్ లాపాంగ్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. దీనితో మేఘాలయ లో కాంగ్రెస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. అయితే సీనియర్‌ నేతలు ‘ఉపసంహరణ’ (పార్టీని వీడి యువతకు అవకాశం) అనే పార్టీ విధానాన్ని అనుసరిస్తూ ఆయన పార్టీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తుంది. అయిష్టంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం రాత్రి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ”నా అభిప్రాయం ప్రకారం, సీనియరులు, కుర వృద్ధుల సేవ పార్టీకి ఇకపై ఉపయోగపడదు,” అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిమితులు తనను నిరుత్సాహ పరుస్తున్నాయని, తనకు సౌలభ్యంగా లేదని తెలిపారు. లాపాంగ్‌ 1992లో మేఘాలయ ముఖ్యమత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం 2003, 2007, 2009 సంవత్సరాలలో ఆయన ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే.
`