నేను అన్యాయాలు, నేరాలు, ఘోరాలు చేయలేదు: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: బాబ్లీ ప్రాజెక్టు ఘటన, నోటీసులు, నాన్-బెయిలబుల్ వారంట్లపై మొదటిసారిగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు… రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ప్రాజెక్టులోనే మరో ప్రాజెక్టును (బాబ్లీ) నిర్మించేందుకు అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే… ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఆవేదనతో నిరసన వ్యక్తం చేసేందుకు అక్కడకు వెళ్లామని చెప్పారు. ఆరోజు మన బోర్డర్ లోనే తమను అరెస్ట్ చేశారని, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆ సందర్భంగా కేసులు పెట్టామని ఒకసారి, కేసులు పెట్టలేదని మరోసారి చెప్పి, ఒక పత్యేక విమానంలో తమను హైదరాబాదులో వదిలిపెట్టారని చెప్పారు. ఇప్పుడేమో నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ వారెంటులు ఇచ్చారని మాట్లాడుతున్నారని అన్నారు.ఆ కేసు గురించి, వారెంట్ గురించి ఏమి చేయాలనే దానిపై తాను ఆలోచిస్తానని చెప్పారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను ఏమి చేసినా ప్రజల కోసమే అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఏ పార్టీ వల్ల మీ జీవితాల్లో వెలుగు వచ్చిందనే విషయం గురించి ఆలోచించి, టీడీపీకి సహకరించాలని విన్నవించారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద జలసిరికి హారతి ఇచ్చిన సందర్భంగా అయన ఈ మాటలన్నారు.

`