చత్తీస్‌గఢ్‌లో ఘోరం…ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారం

వాస్తవం ప్రతినిధి: ప్రేమికుల మీద ఈమధ్య అసాంఘీక దాడులకు పాల్పడుతున్నారు కొందరు కామాంధులు. ఏకాంతంగా కనిపించిన జంటలను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారం జరిగితే , తాను అడ్డుకోకలేకపోయాననే అపరాధ భావంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం చత్తీస్‌గఢ్‌లోని కోర్సా జిల్లాలో జరిగింది. పో;ఈసులు తెలిపిన వివరాల ప్రకారం..
కటోహోరా గ్రామానికి చెందిన సవాన్ సాయి (21), ఓ మైనర్ బాలిక (17) ప్రేమికులు. ఈ క్రమంలో ప్రేమికులు ఓ పాఠశాల వద్ద కూర్చోని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు యువకులు వచ్చి సాయితో గొడవ పడ్డారు. ఆపై సాయిని కొట్టి, బాలికపై అత్యాచారం చేశారు. తాము రేప్ చేశామని గ్రామంలో ప్రచారం చేశారు. దీన్ని అవమానంగా భావించిన సాయి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టగా ఈ గ్యాంగ్ రేప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈశ్వర్, కన్వర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.