జపాన్ ఓపెన్ లో భారత్ కధ ముగిసింది!

వాస్తవం ప్రతినిధి:  జపాన్‌ ఓపెన్‌ సిరీస్‌లో ఇక భారత్ కథ ముగిసింది. తాజాగా తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ 21-19, 16,-21, 18-21 తేడాతో దక్షిణ కొరియా ఆటగాడు లీ డాంగ్‌ భారీ షాక్ ఇవ్వడం తో లీ చేతిలో కిదాంబి ఓటమి పాలయ్యాడు. దీంతో జపాన్‌ ఓపెన్‌లో భారత్‌ కథ ముగిసినట్లైంది. తొలి గేమ్‌ను 21-19తో సొంతం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మొదటి నుంచి లీడాంగ్‌ ఆధిపత్యం సాధించడం తో కిదాంబి ఓటమి తప్పలేదు.  ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో లీడాంగ్‌ది 33వ ర్యాంకు. ప్రస్తుతం శ్రీకాంత్‌ 7వ ర్యాంకులో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అలానే గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌, పురుషుల డబుల్స్‌లోనూ భారత క్రీడాకారులు ముందడుగు వేయలేకపోయారు.