ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను:సోనాలి బింద్రే

వాస్తవం సినిమా: ‘నాకు దేవుని ఆశీస్సులు తోడుగా ఉన్నాయి. ఈ ఏడాది వినాయక ఉత్సవాలు జరుపుకోలేక పోతున్నందుకు బాధగా ఉంది. నా కొడుకు ఆ లోటు తీర్చాడు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ సినీ నటి సోనాలి బింద్రే పోస్టు చేశారు.హైగ్రేడ్‌ మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ అందాల సుందరి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తల్లి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ సోనాలి తనయుడు రణవీర్‌ పూజలు చేసి ఆ ఫొటోను షేర్‌ చేశాడు. దీనిపై సోనాలి ఆ విధంగా స్పందించారు .