థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త

వాస్తవం సినిమా: సముద్రం, పడవలు, దొంగ అనే ఆసక్తి కర కథాంశంతో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్,అమీర్ ఖాన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నది. భారతతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా థగ్స్ హిందూస్తాన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. యాష్ చోప్రా జయంతి రోజైన సెప్టెంబర్ 27 న విడుదల చేయబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్టు కథనం.