మారుతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగ్

వాస్తవం సినిమా: నాగచైతన్య కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా తెరకెక్కింది. ‘వినాయకచవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను నిన్ననే విడుదల చేశారు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమా స్పెషల్ షో చూసిన నాగార్జున, తమ బ్యానర్లో మరో సినిమాను చేసే ఛాన్స్ ను మారుతికి ఇచ్చాడనేది తాజా సమాచారం.

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తన సినిమాలో ఉండేలా చూసుకోవడం మారుతి ప్రత్యేకత. ఆయనలోని ఆ ప్రత్యేకత నచ్చడం వల్లనే నాగార్జున మరో ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్టుకి సంబంధించిన అడ్వాన్స్ కూడా మారుతికి ముట్టినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా అఖిల్ తో ఉండొచ్చని అంటున్నారు. ఇంతకుముందు మారుతి అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తికాగానే అన్నపూర్ణ బ్యానర్లో చేస్తాడని చెప్పుకుంటున్నారు.