“చంద్రబాబు”….అరెస్ట్ కి రంగం సిద్దం.. “లిస్టు” లో ఉంది వీళ్ళే

chandrababu arrest warrant

వాస్తవం ప్రతినిధి:  అనుకున్నదే జరిగింది…శివాజీ నాలుగు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుకి కీలక నోటీసులు అందుతాయి ఇది పక్కా అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు నిజమయ్యాయి..శివాజీ ప్రకటన తరువాత ఒక్క సారిగా ఏపీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే బాబ్లీకేసులో మళ్లీ నోటీసులివ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తోంది…ఈ బాబ్లీ కేసు మూడు రాష్ట్రాలకి ముడిపడి ఉంది.. ఈ కేసు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ, ఏపీకి ముడిపడి ఉంది..

Related image

అయితే మొదటి నుంచీ శివాజీ చంద్రబాబు ని గద్దె దించే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అంటూ ప్రకటన చేస్తూనే వచ్చారు ఇదిలాఉంటే..చంద్రబాబు తో పాటు అప్పట్లో  పాల్గొన్న ఇప్పటి కొంతమంది మంత్రులుగా ఎమ్మెల్యేలకి కూడా అరెస్ట్ వారెంట్ లు జారీ అయ్యాయి..అయితే శివాజీ చెప్పినట్టుగా సోమవారం కానీ లేదంటే నాలుగు రోజులు లేట్ అయినా సరే నోటీసులు రావడం ఖాయం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవ్వడంతో శివాజీ కి లీకులు ఇచ్చేది ఎవరూ అనే సందేహాలు మొదలయ్యాయి..

Image result for chandrababu babli visit arrest

ఇదిలాఉంటే ఇప్పుడు బాబు తో పాటు అరెస్ట్ కి సిద్దంగా ఉన్న ఆ నేతలు ఎవరంటే..నోటీసులు అందుకున్న వారిలో ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఉండగా వారిలో అత్యధికులు తెలంగాణా నుంచీ ఉన్నారు అంతేకాదు ఏపీలో ప్రజాప్రతినిధులకి కూడా నోటీసులు అందాయి..చంద్రబాబుతో పాటు దేవేందర్ గౌడ్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, ఆనంద బాబు, చింతమనేని ప్రభాకర్, సాయన్న, హన్మంత్ షిండే, గంగుల కమలాకర్, టీ ప్రకాశ్ గౌడ్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎల్ఎన్ రాజు, విజయరమణ రావు తదితరులు ఉన్నారు..

Image result for chandrababu babli visit arrest

చంద్రబాబు తో సహవీరందరూ ఈ నెల 16 వ తేదీ లోగా హాజరు అవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది..అయితే చంద్రబాబు తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉండగానే ఈ ఘటన జరిగింది..దాంతో ఏపీ నేతలు ఒక్కొక్కరుగా ఈ విషయంలో స్పందిస్తున్నారు..ఇదంతా రాజకీయ కుట్ర చంద్రబాబు ని నేరుగా ఎదుర్కోలేక ఇలా పాత కేసులని బయటకి తీసి భయపెట్టాలని చూస్తున్నారు..ఇలా ఎన్ని కేసులు పెట్టుకున్న ఎన్ని అరెస్ట్ వారెంట్ లు జారీ చేసినా సరే చంద్రబాబు భయపడరు అంటూ కేంద్రంపై నిప్పులు చేరుగుతున్నారు.