అగ్రరాజ్యం అమెరికా ను వణికిస్తున్న మరో తుఫాన్

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికాను మరో తుఫాన్ వణికిస్తుంది. ఫ్లోరెన్స్ తుఫాన్ కరోలినా తీరంవైపుగా గంటకు 225 కి.మీ. వేగంతో దూసుకొస్తోంది. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ తుపాను తీరంపై విరుచుకుపడే అవకాశమున్నట్లు సంబందిత అధికారులు తెలిపారు.  గత 30ఏళ్లలో ఎప్పుడూ ఇంత శక్తిమంతమైన తుపాను అమెరికా తూర్పు తీరాన్ని తాకలేదు. దీంతో ముందు జాగ్రత్తగా దాదాపు 10 లక్షల మంది వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే దక్షిణ, ఉత్తర కరోలినాలు, వర్జీనియాలో అత్యవసర స్థితిని ప్రకటించారు. ఫ్లోరెన్స్‌ను అత్యంత ప్రమాదకర కేటగిరీ-4 తుపానుగా నిపుణులు అంచనావేశారు. దీంతో తీరంతోపాటు లోలోపలి భూభాగాల్లోనూ విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు.