శాఫ్ ఫుట్ బాల్ కప్ లో పాక్ పై విజయం సాధించిన భారత్

వాస్తవం ప్రతినిధి:  శాఫ్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత జట్టు  పాక్ పై విజయం సాదించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్‌లో భారత్‌ 3-1 తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. దాయాదుల మధ్య పోరు హోరాహోరీగా సాగడంతో తొలి అర్ధభాగంలో గోల్సేమీ నమోదు కాలేదు. అయితే విరామం తర్వాత భారత జట్టు పుంజుకుంది. 49వ నిమిషంలో మన్‌వీర్‌ సింగ్‌ గోల్‌ కొట్టి మన జట్టు ఖాతాను తెరిచాడు. అతనే మరో ఇరవై నిమిషాల్లో ఇంకో గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. సబ్‌స్టిట్యూట్‌ సుమీత్‌ పాసి (83వ నిమిషంలో) గోల్‌తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఫైనల్లో భారత్‌.. మాల్దీవులు జట్టుతో తలపడనుంది.