ఇప్పట్లో నయన్ ని అందుకోవడం కష్టమే

వాస్తవం ప్రతినిధి: సౌత్ లో క్రేజీ గర్ల్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న నయనతార క్రేజ్ రోజు రోజుకు బాగా పెరుగుతుంది. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ సంచలనం రేపుతోంది. ఇప్పటికే నయనతార నటించిన కోలమవు కోకిల సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి క్రేజ్ ఇంకా రెట్టింపైంది. దాంతో వెంటనే తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచేసిందట. ఇప్పటి వరకు రెండు కోట్ల వరకు తీసుకునే ఈ అమ్మడు ఇలా ఒక్కసారిగా పారితోషికం పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. తెలుగులో మెగాస్టార్ సరసన సైరా సినిమాలో నటిస్తున్న నయనతార అటు అజిత్, కమల్ హాసన్ భారతీయుడు 2, లతో పాటు మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.