కాణిపాకంలో శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: వినాయకచవితి సందర్భంగా కాణిపాకంలో శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. గురువారం ప్రారంభమయ్యే బ్రహోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు అక్టోబరు 3 వరకు జరగనున్నాయి. వినాయకచవితి సందర్భంగా గురువారం వేకువజామున అభిషేకాల అనంతరం ఉదయం 4 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి హంస వాహన సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 22న జరిగే ధ్వజావరోహణం, త్రిశూల స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 3 వరకు స్వామివారికి 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.