మిస్టర్ మజ్ను కోసం మరో క్రేజీ భామ

వాస్తవం ప్రతినిధి: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మరో క్రేజీ భామ కాజల్ కూడా ఈ సినిమాలో కీ రోల్ లో కనిపిస్తుందట. కాజల్ ఈ సినిమాలో నటిస్తుందన్న విషయం సర్వత్రా ఆసక్తి నేలకెత్తింది. అన్నట్టు ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేసేలా ఉన్నారు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.