అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ కొట్టివేత

వాస్తవం ప్రతినిధి: ఇటీవల తెలంగాణా అసెంబ్లీ ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు వాజ్యం దాఖలు అవ్వగా దానిని కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తుంది. రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో కన్పించడం లేదని పేర్కొన్న కోర్టు రాజ్యాంగ అంశాలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. కేవలం రాజకీయ పలుకుబడి కోసమే కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఎన్నికల కమిషన్‌పై కూడా విపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేశాయి. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.