ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న జగ్గారెడ్డి అవినీతి భాగోతాలు

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడం తో అరెస్ట్ చేశారు. అయితే ఆయన చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమీన్‌పూర్ ఫ్రీడం ఫైటర్స్ భూ బాధితులు జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ మహేందర్‌ను కలిశారు. స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన 80 ఎకరాల భూమిని.. జగ్గారెడ్డి తమకు అమ్మి కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్‌ను బాధితులు కోరినట్లు తెలుస్తుంది. నకిలీ పత్రాలతో జగ్గారెడ్డి మమ్మల్ని తప్పుదోవ పట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని పట్టించుకోలేదని వారంతా వాపోయారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.