మట్టిలో కూరుకుపోయిన ఎమ్యెల్యేల బస్సు

వాస్తవం ప్రతినిధి: అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్తున్న ఎమ్యెల్యేల పర్యటనకు స్వల్ప ఆటంకం కలిగింది… ఎమ్యెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు దెందులూరు సమీపంలో రోడ్డు పక్కన మట్టిలో కూరుకుపోయింది… ఆ సమయంలో బస్సులో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు… మట్టిలో కూరుకుపోయిన బస్సును వెళికి తీసేందుకు డ్రైవర్, ఇతర సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో… ఆ 35 మంది ప్రజా ప్రతినిధులను పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి వెంటనే వేరే వాహనాలను సమకూర్చారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందులూరు వద్ద ప్రజా ప్రతినిధులకు అల్పాహారం చేయాలని భావించారు… దీంతో దెందులూరు వద్ద రోడ్ పక్కన బస్సును ఆపేందుకు ప్రయత్నం చేయగా మట్టిలో కూరుకుపోయింది.