రష్యాకు చేరుకున్న చైనా అధ్యక్షుడు!

వాస్తవం ప్రతినిధి: చైనా అధ్యక్షుడు సి జిన్ పింగ్ మంగళవారం రష్యా కు చేరుకున్నారు. 4వ ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరం (ఈఈఎఫ్‌) సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు సి జిన్‌పింగ్‌ మంగళవారం రష్యాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాల్గొనడం ఇదే తొలిసారి. వ్లాదివోస్తోక్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో జిన్‌పింగ్‌కు రష్యా ఉన్నతాధికారులు, రష్యాలో చైనా దౌత్యవేత్త లి హు ఘనస్వాగతం పలికారు. 2013 తరువాత జిన్‌పింగ్‌ రష్యాలో పర్యటించడం ఇది ఏడోసారి. ఈ పర్యటనలో జిన్‌పింగ్‌ అనేక ద్వైపాక్షిక సమావేశాలతో పాటు, పుతిన్‌తో కూడా భేటీకానున్నారు. ఈఈఎఫ్‌ వార్షిక సమావేశంలోనూ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఇతర దేశాధినేతలతోనూ సమావేశమవుతున్నట్లు సమాచారం.