ఏపీలోనూ “ముందస్తు”..జగన్ లీకులో “మర్మం” ఏమిటో..?

వాస్తవం ప్రతినిధి: రోజు రోజు కి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రాజకీయ నేతలకి హై బీపీ తెప్పిస్తున్నాయి..వివిధ పార్టీల నేతలకి ఏది నిజమో ఏది అబద్దమో తెలియక తెగ తికమకపడిపోతున్నారు…ఒక పక్క తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ గులాబీ జెండా ఊపేసి అసెంబ్లీని రద్దు చేసేసి బస్తీమే సవాల్ అంటూ మహా కూటమికి తొడగొట్టి మరీ సవాల్ విసిరితే కేసీఆర్ ఇట్టాంటోడు అట్టాంటోడు అంటూ విమర్శలు చేస్తూ కూటమి నేతలంతా కళ్ళప్పగించి చూస్తూ ఉండటం తప్ప ఒరిగింది ఏమి లేదని..కేసీఆర్ ని ఎదుర్కోవాలి అంటే ఎన్ని కూటములు వచ్చినా లాభం ఉండదనే అభిప్రాయాన్ని తెలుపుతున్నారు రాజకీయ పరిశీలకులు..అయితే


ఇదే సమయంలో చంద్రబాబు ముందస్తు కి ససేమిరా అంటూ వెళ్తే కొంప మునుగుతుంది అనే విషయం గ్రహించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు..పై కి ఎంత ధైర్యంగా కనపడినా బాబోరి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి అనడంలో సందేహం లేదనే చెప్పాలి ఎందుకంటే ముందస్తు వస్తే అడ్డంగా మునిగిపోయిదే ముందుగా టీడీపీ నే కాబట్టి ఈ విషయంలో తేలు కుట్టిన దొంగలా కిమ్మనడం లేదట..అయితే ఈరోజు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కి హోల్సేల్ గా దిమ్మతిరిగి బొమ్మ కనిపించేసింది అంటున్నారు..ఇంతకీ ఏమిటా ప్రకటన అంటే. .

తెలంగాణలో ముందస్తు మాత్రమే కాదు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు ఉండబోతున్నాయి అందరూ సిద్దంగా ఉండండి అంటూ జగన్ ఈరోజు ఒక కీలక ప్రకటన చేశాడు..తాజాగా వైసీపీ అధినేత చేసిన ఈ ముందస్తు వ్యాఖ్యలు సంచలనానికి తెరలేపాయి…సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతాయి. కానీ ఈ సారి ఎన్నికలు ముందుగా అంటే జనవరిలోనే జరుగుతాయని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడంతో ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశంగా మారింది..విశాఖలో ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ ఒక్క సారిగా నిన్నటికి నిన్న పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు…


ఈ సమావేశంలో జగన్ ముందస్తు ఎన్నికలపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది..అంతేకాదు వైసీపీ పార్టీకి ఎంతో కీలకమైన నవరత్నాలు పదకాలని ఈ నెల 17 నుండి ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని నేతలకు కీలక ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు పీకే ఇచ్చిన సమాచారం మేరకు నియోజక వర్గ ఇంచార్జ్ చెవుల్లో తుప్పు వదిలిపోయేలా క్లాస్ కూడా తీసుకున్నారట..నిన్న కాక మొన్న వచ్చిన జనసేన కి గ్రామాల్లో ఫాలోయింగ్ ఉంటోందని మీరందరూ ఏమి చేస్తున్నారని ముఖ్యంగా పశ్చిమ గోదావరి ఇంచార్జ్ లకి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. అయితే జగన్ ముందస్తు గురించి కీలక వ్యాఖ్యలు చేయడం వెనుక మోడీ ఏమన్నా లీకులు ఇచ్చారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..ఏది ఏమైనా జగన్ ముందస్తు రాగం టీడీపీ లో హైపర్ టెన్షన్ తెప్పించింది అనడంలో సందేహం లేదనే చెప్పాలి.