అమెరికాకు ముంచుకొస్తున్న మరో ముప్పు

వాస్తవం ప్రతినిధి: హార్వే, ఇర్మా, మారియా హరికేన్‌ల దెబ్బ నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. నార్త్‌ కరోలినా తీరంలో ప్రస్తుతం కురుస్తున్న తుఫాను హరికేన్‌గా మారిందని అధికారులు ప్రకటించారు. ‘హరికేన్‌ ఫ్లోరెన్స్‌’గా దీనికి నామకరణం చేశారు. ఇది కూడా కేటగిరి-4 హరికేన్‌గా బలపడనుందని జాతీయ హరికేన్‌ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ హరికేన్‌ ధాటికి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. నార్త్‌ కరోలినా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీరం దాటే సమయంలో కుండపోత వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.