మరోసారి దుస్సాహసానికి పాల్పడ్డ చైనా

వాస్తవం ప్రతినిధి: చైనా ఆర్మీ మళ్లీ సరిహద్దుల్లో దుస్సాహ‌సం చేసింది. తూర్పు లడాఖ్ లోని డెమ్ చొక్ ఏరియాలోకి చైనా ఆర్మీ ప్రవేశించింది. ఎల్‌ఏసీ దాటి ఉత్తరాఖండ్‌లోని బరహోటి ప్రాంతంలోనూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దూసుకువచ్చింది. డెమ్‌చోక్ ఏరియాలో 300 మీటర్లు ముందుకు వచ్చిన చైనా ఆర్మీ అక్కడ టెంట్లు కూడా వేశారట. అయితే లోకల్ కమాండర్‌తో ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత చైనా దళాలు తమ టెంట్లను తీసి వేసినట్లు తెలుస్తోంది. 2016లో 273 సార్లు, 2017లో 426 సార్లు చైనా ఆర్మీ మన భూభాగంలోకి ప్రవేశించింది.